నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కరోనా కోరలు చాస్తోంది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ సోకింది. బాధితుడు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.
మృతుడు బోధన్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ మరణించాడు.