ETV Bharat / state

కంటి చూపు సరిగా లేకున్నా లఘుచిత్రాలకు దర్శకత్వం - చూపు సరిగా లేకున్నా దర్శకత్వం

కంటి చూపు సరిగా లేకున్నా... ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా... అనుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నాడు... నిజామాబాద్‌కు చెందిన విశాల్ అనే యవకుడు. 40 ఏళ్లకు పూర్తి అంధత్వం వస్తుందని తెలిసినా.. నిరాశ చెందక లఘుచిత్రాలతో దర్శకుడిగా రాణిస్తున్నాడు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ.. వెండితెరపై దర్శకుడిగా తన పేరు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. స్వయం ఉపాధితో ఎవరిపై ఆధారపడక ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Directing short films without eye contact in nizamabad district
కంటి చూపు సరిగా లేకున్నా లఘుచిత్రాలకు దర్శకత్వం
author img

By

Published : Jun 19, 2021, 3:30 PM IST

కంటి చూపు సరిగా లేకున్నా లఘుచిత్రాలకు దర్శకత్వం

మూడేళ్లకే విశాల్‌కు కంటి చూపు సమస్య ఎదురైంది. దూరంలోని వస్తువులు మసకగా కనిపించేవి. వైద్యుల రెటీనా సమస్య ఉందని... వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గుతుందని.. 40 ఏళ్లు వచ్చే సరికి పూర్తిగా అంధత్వం రావొచ్చన్నారు. కంటి సమస్య తలెత్తడంతో విశాల్‌ను స్థానికంగా ఉన్న స్నేహ సొసైటీ అంధుల పాఠశాలలో చేర్పించారు. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని జీఎల్ఆర్ న్యూ మోడల్ కళాశాల నుంచి ఇంటర్‌, దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశాడు.

తెలియని పరిస్థితి

చదువుకునే రోజుల్లో విశాల్‌ను లూయీ బ్రెయిలీ చరిత్ర ఆకర్షించింది. ఆయన జీవిత చరిత్ర అందరికీ చేరువ చేసేందుకు లఘుచిత్రం తీయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సంగీతం, సినిమాపై అభిరుచి పెరిగింది. ఎలాగైనా ప్రతిభ నిరూపించుకోవాలని భావించాడు. కానీ చిత్ర నిర్మాణం గురించి ఎవరిని అడగాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితి. తన ఆలోచన ఎవరికి చెప్పినా అవమానాలు, అవహేళనలు తప్ప సహకారం మాత్రం లభించలేదు. అయినా పట్టు వదలకుండా లఘుచిత్రాలపై దృష్టి సారించాడు.

ప్రశంసలు

అనేక ఇబ్బందులు ఎదురైనా లఘు చిత్రాలను వదిలి పెట్టలేదు విశాల్. తనకొచ్చే దివ్యాంగ పింఛను డబ్బులు పోగు చేసి.. తొలి ప్రయత్నంగా ఆదర్శ దివ్యాంగులు అనే చిత్రం తీశాడు. విశాల్‌తోపాటు అతడి ఇద్దరు స్నేహితులకు ఎదురైనా ఇబ్బందులు, మానసిక స్థితిగతులకు రూపం ఇస్తూ నిర్మించిన ఈ చిత్రం.. అందరి ప్రశంసలు పొందడంతో పాటు విశాల్‌లోని ప్రతిభను చాటి చెప్పింది.

ఆలోచింపజేసేలా

విశాల్‌ చదువుకున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య సహకారంతో రెండవ లఘు చిత్రం మరువలేని ప్రేమ నిర్మించాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయిని ప్రేమించిన పేదింటి యువకుడి పరిస్థితి ఏంటని ఆలోచింపజేసేలా చూపించాడు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లిన వారు పడే బాధల గురించి గల్ఫ్ గోసను తీశాడు.

12 లఘుచిత్రాలు

తల్లిదండ్రులకు భారం కాకూడదని.. ప్రభుత్వ సహకారంతో సొంతంగా ఓ పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు...విశాల్‌. వచ్చే ఆదాయంతో లఘు చిత్రాలు తీస్తున్నాడు.ఇప్పటి వరకు 6 ఆల్బమ్ సాంగ్స్‌, 12 లఘుచిత్రాలు తీసిన ఈ యువకుడు.. ఎప్పటికైనా వెండి తెర మీద తన పేరు చేసుకోవాలని కలలు కంటున్నాడు. విశాల్ గురించి బెంగపెట్టుకున్న కుటుంబసభ్యులు సైతం ఇప్పుడు అతడి ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా

లఘుచిత్రాలతో ప్రతిభ నిరూపించుకుంటూనే వెండితెర వైపూ అడుగులు వేశాడు.. విశాల్. ఒక్కక్షణం, రుబాబు వంటి టాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ అనుభవంతో స్నేహితుల సహకారంతో గంటన్నర నిడివి గల మౌనప్రేమ అనే సినిమా సొంతంగా తీస్తున్నాడు. శాస్త్రీయ సంగీతంలో పట్టున్న విశాల్‌.. ఇందుకోసం 2పాటలు సైతం కంపోజ్ చేశాడు.

క్రీడాకారుడిగానూ

దివ్యాంగుడైన అనే భావన లేకుండా నచ్చిన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తపిస్తున్న విశాల్‌.. క్రీడాకారుడిగానూ రాణించాడు.పాఠశాల దశలో కరాటే జిల్లా స్థాయి పోటీల్లో మెుదటిస్థానంలో నిలిచాడు. 2013లో జిల్లాస్థాయి పరుగు పోటీల్లో రజతం సాధించాడు. విధి చిన్నచూపు చూసినా.. అటు విద్య, ఇటు క్రీడలు, కళల్లో తనదైన రీతిలో రాణిస్తూ...అందరి అభినందలందుకుంటున్నాడు...విశాల్‌.

ఇదీ చూడండి: Minister Errabelli: కాన్వాయ్​ని అడ్డుకున్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.