నిజామాబాద్ పురపాలికలో కాకతీయ విద్యాసంస్థలలోని గోదావరి క్యాంపస్లో రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని సమర్ధవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: కళ్లులేకపోయినా... ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధుడు