నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దేవి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. శ్రీ చక్రేశ్వర శివాలయంలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న దేవీ మాత ఈరోజు నిమజ్జనానికి బయలుదేరింది. బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్మన్ పద్మశరత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివాలయం నుంచి మొదలైన శోభాయాత్ర అంబేడ్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, ఆచన్పల్లి మీదుగా రేంజల్ మండలంలోని కందకుర్తి వద్ద త్రివేణి సంఘమంలో నిమజ్జనం చేస్తారు. సంవత్సరం కొవిడ్ నిబంధనల మధ్య జరుపుకున్న వేడుకలు వచ్చే సంవత్సరానికి కరోనా వైరస్ తొలగిపోవాలని ఆర్డీవో ఆకాంక్షించారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ బస్సుల్లో ఇక భౌతిక దూరం లేదు..!