నిజామాబాద్ జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. జిల్లాలోని నందిపేట మండలం పాతూర్ గ్రామానికి చెందిన శ్రీ ఓంకారరూపిణి యూత్ సభ్యులు 41 లక్షల రూపాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతీ సంవత్సరం దుర్గామాతను ప్రతిష్ఠిస్తామని..తొమ్మిది రోజుల్లో ప్రతీ రోజు ఒక్కో అవతారంలో అమ్మవారిని అలంకరిస్తామన్నారు యూత్ సభ్యుడు భరత్ . ఇందులో భాగంగానే నేడు శ్రీ మహాలక్ష్మీ అవతారం కావడం వల్ల నగదుతో మండపాన్ని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించామన్నారు. దుర్గాష్టమి రోజున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అన్నదానం ఏర్పాటు చేస్తామని భరత్ పేర్కొన్నారు.
41 లక్షల రూపాయల అలంకరణలో శ్రీ మహాలక్ష్మీ - దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో శ్రీ ఓంకార రూపిణి యూత్ సభ్యులు 41 లక్షల రూపాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు.

నిజామాబాద్ జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. జిల్లాలోని నందిపేట మండలం పాతూర్ గ్రామానికి చెందిన శ్రీ ఓంకారరూపిణి యూత్ సభ్యులు 41 లక్షల రూపాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతీ సంవత్సరం దుర్గామాతను ప్రతిష్ఠిస్తామని..తొమ్మిది రోజుల్లో ప్రతీ రోజు ఒక్కో అవతారంలో అమ్మవారిని అలంకరిస్తామన్నారు యూత్ సభ్యుడు భరత్ . ఇందులో భాగంగానే నేడు శ్రీ మహాలక్ష్మీ అవతారం కావడం వల్ల నగదుతో మండపాన్ని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించామన్నారు. దుర్గాష్టమి రోజున గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అన్నదానం ఏర్పాటు చేస్తామని భరత్ పేర్కొన్నారు.
TAGGED:
నిజామాబాద్ జిల్లా