ETV Bharat / state

వర్షాలకు ధ్వంసమైన కల్వర్టులు, వంతెనలు... రూ.90 కోట్లతో మరమ్మతులకు ప్రతిపాదనలు

పది రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వాటిని రిపేరు చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి... ప్రతిపాదనలు చేస్తున్నారు. మరమ్మతులకు కావాల్సిన నిధులను అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేసేందుకు గానూ సుమారు రూ.90 కోట్లు అవసరముంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

damaged roads repairs in nizmabad district

author img

By

Published : Aug 26, 2020, 1:26 PM IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఇటీవల పది రోజుల పాటు కురిసిన వర్షాలకు 242.85 కి.మీ రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రతిపాదనలు రూపొందించారు. ధ్వంసమైన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు రూ.2.36 కోట్లు అవసరమని అధికారులు గుర్తించారు. అదేవిధంగా రోడ్లు, కల్వర్టులు, వంతెనల శాశ్వత నిర్మాణానికి రూ.87.14 కోట్లు అవసరమవుతాయని ఆ శాఖ అధికారులు నివేదించారు.

గడిచిన వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలు రోడ్లు, కల్వర్టులు, దెబ్బతిన్నాయి. రామారెడ్డి మండలం కేంద్రం నుంచి తూంపల్లికి వెళ్లే రోడ్డుమార్గంలో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. జుక్కల్‌, మద్నూర్‌ మండలాల్లో రోడ్లన్నీ తెగిపోయాయి. బోధన్‌, కోటగిరి, వర్ని, సిరికొండ మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు రూపొందించారు.

వేర్వేరుగా ప్రతిపాదనలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 242 కి.మీ మేర పాక్షికంగా ధ్వంసమైనట్లు రహదారులు భవనాల శాఖ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి వేర్వేగా ప్రతిపాదనులు రూపొందించారు. చాలా రోడ్లపై పెద్ద ఎత్తున గుంతలు నెలకొన్నాయి. వీటిని అలానే వదిలేస్తే పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. వీటికి తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.

ఇక్కడ విచిత్రం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి దేవునిపల్లి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ దశలో ఉంది. రెండేళ్లుగా నత్తనడకన సాగుతోంది. రోడ్డుకుఇరువైపుల విస్తరణ కోసం తవ్వి కంకర నింపి వదిలేశారు. మరో వంతెన నిర్మాణం చేపట్టారు. ఇంకా పనులు పూర్తికాక ముందే రోడ్డుపై గుంతలు పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ప్రతిపాదనలు రూపొందించాం

- రాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ, నిజామాబాద్‌

ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అందుకోసం ప్రతిపాదనలు తయారు చేశాం. ఉమ్మడి జిల్లాలో 242 కి.మీ మేర రోడ్లు ధ్వంసంకాగా.. కల్వర్టులు, వంతెనలు పాడయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.