లాక్డౌన్ వల్ల ఉపాధికోల్పోయిన ప్రజలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెను భారం మోపుతున్నాయని నిజామాబాద్ జిల్లా సీపీఎం కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం కరోనా వైరస్ నిర్మూలన నుంచి రక్షిణ చర్యలు చేపట్టకపోగా.. ప్రజలపై అధిక ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేయడం సరికాదని సీపీఎం కార్యదర్శి రమేశ్‌బాబు తెలిపారు.
వేతనాల్లో కోత.. దారుణం
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటం వల్ల గత 12 రోజుల నుంచి పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 6.55 పైసలు డీజిల్ పైన రూ. 7.04 పైసలు భారం పడిందని రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీని మూలంగా నిత్యావసర సరకుల ధరలు పెరిగి మరింత భారం పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో కోత విధిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావడంపై రమేశ్‌బాబు మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు పెద్ద వెంకట్ రాములు, సూరి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు