ETV Bharat / state

కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సీపీఐ(ఎంఎల్) ధర్నా

author img

By

Published : Jun 23, 2020, 1:00 PM IST

ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు ఉచితంగా చేయాలని, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్​ చేశారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు.

CPIML Protest For Free Corona Tests And Treatment In Nizamabad
కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సీపీఐ(ఎంఎల్) ధర్నా

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఆఫీసు ఎదుట సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని, పరీక్షల సంఖ్య పెంచి.. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నాయకులు డిమాండ్​ చేశారు.

లాక్​డౌన్​ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం మరచి ఖజానా ఎలా నింపాలన్న ఆలోచనకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆరోపించారు. లాక్​డౌన్​లో 300 యూనిట్ల వరకు ఇళ్లు, చిన్న, మధ్య తరగతి, సూక్ష్మ తరహా పరిశ్రమలకు ఉచితంగా విద్యుత్ అందించాలని డిమాండ్​ చేశారు. పెంచిన విద్యుత్​ ఛార్జీలు మాఫీ చేయాలన్నారు. పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని సీపీఐ (ఎంఎల్) జిల్లా నాయకులు వనమాల కృష్ణ డిమాండ్​ చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్​కు వినతి పత్రం సమర్పించారు.

ఇవీ చూడండి: కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.