దిల్లీలో రైతులపై మోపుతున్న దేశద్రోహం, ఉపా లాంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించడం చేతగాని కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు.
కుట్రలో భాగం..
కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతులు రెండు నెలలకు పైగా శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని ఎలాగైనా ఆపాలన్న కుట్రతో వారి నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు.
ఉద్యమం ఆపివేయడానికి భాజపా, ఆరెస్సెస్, కార్యకర్తలతో కేంద్రం పక్కదోవ పట్టిస్తోందని విమర్శించారు. పోరాటాన్ని చీల్చాలని చేసిన కుట్రలో భాగమే ఎర్రకోట ఘటన అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాపయ్యా, శ్రీధర్, ఎల్బీ రవి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష