ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకే స్పీడ్ లేజన్ గన్లను ఏర్పాటుచేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తీకేయ తెలిపారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
డాప్లర్ సిద్ధాంతం ఆధారంగా స్పీడ్ గన్ వాహన వేగం లెక్కిస్తుందని చెప్పారు. వాహనం నంబర్ ప్లేట్ వివరాల ఆధారంగా చలానా జనరేట్ అవుతుందన్నారు. వాహనం 200 మీటర్ల దూరం వెళ్లేలోపు ఫోన్‌కు మెసేజ్ రూపంలో చలానా వస్తుందని తెలిపారు. స్పీడ్ అధికంగా ఉన్న వాహనదారులకు రూ.1000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. మూడు చలానాలు పెండింగ్ ఉన్న వాహనాలను సీజ్ చేస్తామన్నారు.
ఇవీచూడండి: నిర్లక్ష్యం చేస్తే హైదరాబాద్ కాలుష్యకాసారమవుతుంది: సీఎం