కొవిడ్ బారిన పడి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్న 210 మంది కరోనా బాధితులు నేడు డిశ్చార్జ్ అయ్యారు. ప్రాణాలు పోతాయనే భయంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తమను వైద్యులు కంటికి రెప్పలా చూసుకున్నారని వారు పేర్కొన్నారు. వైద్యులు తమకు ధైర్యం చెప్తూ ప్రతిరోజు వైద్యాన్ని అందించినట్లు తెలిపారు, మంచి పౌష్టికాహారాన్ని అందించారన్నారు. కరోనా నుంచి కోలుకున్న బాధితులను వైద్యులు చప్పట్లతో ఇళ్లకు సాగనంపారు.
వారికి నయం కావడంలో కీలక పాత్ర వహించిన వైద్యులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్, శానిటేషన్ సేవలు బాగున్నాయని కరోనా నుంచి కోలుకున్న పలువురు కొనియాడారు.
ఇవీ చూడండి: 70 శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు