ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. ఇందల్వాయి మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలు కరోనాతో బుధవారం మృతిచెందారు. అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. జేసీబీ సాయంతో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ హృదయ విదారక ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. డిచ్పల్లి మండలంలో ఒకరు, జక్రాన్పల్లి మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మోపాల్ మండలంలో ఓ సొసైటీ ఛైర్మన్ మహమ్మారి కాటుకు బలయ్యారు. ఓ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బుధవారం మృతిచెందారు. ఈ క్రమంలో జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోం: ఎర్రబెల్లి