ETV Bharat / state

కరోనా మృతదేహాలు తారుమారు.. ఆందోళనలో బంధువులు

కరోనాతో మరణించిన వారి మృతదేహాలు తారుమారైన సంఘటన హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మృతదేహాలు మారాయని ఆంబులెన్స్ డ్రైవర్ చెప్పగా.. అవాక్కైన మృతుని బంధువులు ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

corona-dead-bodies-exchanged-in-nizamabad
కరోనా మృతదేహాలు తారుమారు
author img

By

Published : Sep 26, 2020, 3:05 PM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమంతు(58) హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. రూ.10 లక్షల 30 వేల బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పగా.. మృతుని బంధువులు బిల్లు చెల్లించారు. శనివారం రోజున మృతదేహాన్ని అంబులెన్స్​లో తమ గ్రామానికి పంపిస్తామని చెప్పగా.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

మృతదేహాన్ని అంబులెన్స్​లో గన్నారం గ్రామానికి తరలించారు. అంత్యక్రియల్లో భాగంగా మృతదేహానికి నిప్పు పెడుతున్న సమయంలో ఆంబులెన్స్​ డ్రైవర్ వచ్చి.. మృతదేహాలు మారాయని చెప్పగా.. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాల తరలింపులోనే ఇలా చేశారంటే.. చికిత్స ఎలా చేశారోనని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.