ETV Bharat / entertainment

సినిమాగా రానున్న 'సిటడెల్‌' పార్ట్‌2!- హీరో హింట్ నిజమేనా? - CITADEL HONEY BUNNY

సినిమాగా రానున్న సమంత 'సిటడెల్ పార్ట్ 2' - వరుణ్​ ధావన్ ఆసక్తికర కామెంట్స్!

Etv Varun Dhawan About Citadel Honey Bunny
Samantha Varun Citadel Honey Bunny (ETV Bharat, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 12:03 PM IST

Varun Dhawan About Citadel Honey Bunny : స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్​ ధావన్ జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ 'సిటడెల్‌: హనీ-బన్నీ'. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ నెట్టింట విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ స్టోరీని పార్ట్‌ 2గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీని గురంచి తాజాగా హీరో వరుణ్‌ ధావన్‌ ఓ ఆసక్తికర కామెంట్‌ చేశారు.

తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆయన ఆ సమయంలో దీని పార్ట్‌ 2 గురించి మాట్లాడారు. రెండో భాగం ఎప్పుడు అని ఓ నెటిజన్‌ అడగ్గా, "ప్రస్తుతం నేను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. అవన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే 'సిటడెల్‌: హనీ-బన్నీ' మేకర్స్‌ ఈ సిరీస్‌ పార్ట్‌ 2ను సినిమాగా తీసుకురావాలని అనుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. కానీ త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది." అని వరుణ్​ చెప్పారు.

స్టోరీ ఏంటంటే?
హనీ (సమంత) నైనిటాల్‌లోని ఓ కెఫేలో పనిచేస్తుంటుంది. ఆమెకు నాడియా (కశ్వీ మజ్ముందార్‌) అనే ఐదేళ్ల కూతురు ఉంటుంది. కెఫే కోసం సరకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన సమయంలో హనీని ఓ వ్యక్తి అనుసరిస్తూ ఉంటాడు. అది గమనించిన ఆమె అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పట్టుబడుతుంది. అయితే ఆ చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని తన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్తుంది. కానీ హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని కొందరు వ్యక్తులు అక్కడికీ వెళ్తారు.

మరోవైపు విదేశాల్లో ఉన్న బన్నీ చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. అయితే హనీ వెంట పడుతున్న ఆ వ్యక్తులు ఎవరు? ఎంతటి వారితోనైనా పోరాడే సామర్థ్యం ఆమెకు ఎలా వచ్చింది? ఇంతకీ ఆమె గతం ఏంటి? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు హనీని, అలాగే తన బిడ్డ నాడియాను బన్నీ కలిశాడా? అయితే ప్రైవేటు సీక్రెట్‌ ఏజెన్సీ నాయకుడు గురు (కేకే మేనన్‌) ఒకవైపు, 'సిటడెల్‌' టీమ్​ మరోవైపు వెతుకుతున్న అర్మార్డ్‌ అనే వస్తువు ఏంటి? చివరకు అది ఎవరి చేతికి చిక్కింది? అన్న విషయాలు తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే!

'సిటాడెల్​లో నటించడం ఓ సవాలు- అలాంటి పాత్రలు చెయ్యను'

వరుణ్, సమంత - సింగిల్ షాట్​లో 11 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.