ETV Bharat / state

గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు మృతి - nizamabad Congress party minority president dies of heart attack

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ కరీం గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు మృతి

author img

By

Published : Aug 14, 2020, 7:17 PM IST

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ కరీం గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అబ్దుల్ కరీం.. పార్టీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడిగా పదవులు చేపట్టి... ఏ పదవిలో ఉంటే ఆ పదవికి 100% వన్నె తెచ్చిన వ్యక్తి అని నాయకులు కొనియాడారు.

సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మహేశ్ కుమార్ గౌడ్, గడుగు గంగాధర్ ,అర్బన్ ఇంఛార్జి తాహెర్ బిన్ హందాన్, పట్టణ అధ్యక్షుడు కేశ వేణు, రూరల్ ఇంఛార్జి భూపతి రెడ్డి, తదితరులు ఉన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.