నిజామాబాద్ జిల్లా బాల్కొండ, బస్సాపూర్ మండలాల్లో జిల్లా అదనపు కలెక్టర్ లత పర్యటించారు. పల్లెప్రగతి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వైకుంఠదామం, డంపింగ్‌యార్డులు, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారులు, స్థానిక ఆదర్శ పాఠశాలలో నాటిన మొక్కలు, వాటిని పెంచుతున్న తీరుపై ఆరా తీశారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
కమిషనర్ పర్యటన..
బాల్కొండ మండలం వన్నెల్(బి), శ్రీరాంపూర్‌లో నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ జితేంద్రకుమార్ పాటిల్ పర్యటించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులను నిర్వాహణ, తడిపొడి చెత్తను వేరుచేయడంపై వివరించారు. వైకుంఠధామం పనులను పరిశీలించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని చెప్పారు.
ఇదీ చూడండి : రానున్న రోజుల్లో తెరాస కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుంది : బండి