జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి ఐసోలేషన్ సెంటర్కు ఫోన్ కాల్ వచ్చినా వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిజామాబాద్ కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా మాక్లూర్లోని కొవిడ్ ఐసోలేషన్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు.

ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నవారికి అన్ని వసతులు కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలన్నారు. కేంద్రంలో డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. పేషెంట్లకు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'