ETV Bharat / state

జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్ - యూరియా కొరత

నిజామాబాద్​ జిల్లాలో యూరియా డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని అవసరమైనంత మేరకు యూరియా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డిని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి తెలిపారు. మంత్రి స్పందించి వెంటనే జిల్లాకు యూరియా  కేటాయించారని ఆయన వివరించారు.

Collector Says No Urea Shortage In Nizamabad District
జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్
author img

By

Published : Sep 1, 2020, 10:36 PM IST

నిజామాబాద్​ జిల్లాలో రైతులు, యూరియా డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని అవసరమైనంత యూరియా అందుబాటులో ఉండేలా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డిని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వం ద్వారా జిల్లాకు మూడు ర్యాక్​లో యూరియా కేటాయించేలా చర్యలు తీసుకున్నారని, క్రిబ్కో ద్వారా 548 మెట్రిక్​ టన్నులు, ఎన్​ఎఫ్​సీఎల్ ద్వారా 500, ఎన్​ఎఫ్​ఎల్​ ద్వారా 1200 మెట్రిక్​ టన్నులు మొత్తం 2248 టన్నుల యూరియా జిల్లాకు చేరుకోనుందని కలెక్టర్​ తెలిపారు. అన్ని సొసైటీలకు వీలైనంత త్వరగా యూరియా అన్​లోడ్​ చేయనున్నట్టు, సొసైటీలు, ప్రైవేట్​ డీలర్ల దగ్గర యూరియా అందుబాటులో ఉండనున్నట్టు కలెక్టర్​ అన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దని, జిల్లాలో యూరియా కొరత లేదని ఆయన ప్రకటించారు.

ఇదీ చూడండి : ఒకప్పుడు ఆటలో మేటి.. విధి వక్రించి బతుకు భారమైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.