గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. నదిలోకి వెళ్లొద్దని, ముంపు వచ్చే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు.
మహారాష్ట్రలోని జైక్వాడి, ఇతర అనుబంధ ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతున్న కారణంగా మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని అక్కడి అధికారుల సమాచారంతో... జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది ప్రవహిస్తున్న మండలాల రెవిన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైనచోట సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: ఎడతెరిపిలేని వానలు... తడిసి ముద్దైన హైదరాబాద్