కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్నవారికి వెంటనే మెడికల్ కిట్ అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని నడిపల్లి, ధర్మారం(బి) గ్రామాల్లో నిర్వహిస్తోన్న ఇంటింటి ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్ అందించి.. వారు హోం ఐసోలేషన్లో ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. మెడికల్ సిబ్బంది ఇచ్చిన మందులు వాడాలని.. తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి.. రెండో డోసు కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు