ETV Bharat / state

కలెక్టర్ గారూ.. ఎంపీడీఓ బెదిరించాడు... చర్యలు తీసుకోండి - youngster lodged complaint

సమాచారం అడిగినందుకు ఫోన్​లో బెదిరింపులకు గురి చేసిన ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశాడు. కలెక్టర్​తో పాటు జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశాడు.

కలెక్టర్ గారూ.. ఎంపీడీఓ బెదిరించాడు... చర్యలు తీసుకోండి

author img

By

Published : Sep 6, 2020, 12:06 PM IST

హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన సంజీవ్ లాక్​డౌన్ కారణంగా స్వగ్రామానికి వచ్చాడు. ఉపాధి హామీ పనుల్లో వేతనాలు సరిగ్గా రావడం లేదని గమనించి.. గ్రామానికి సంబంధించిన వివరాల గురించి పంచాయతీ కార్యదర్శి స్వప్నను ఆగస్టు 31న అడిగాడు. సమాచార హక్కు చట్టం కింద తీసుకోవాలని సూచించింది.

నువ్వు రాకుంటే... పోలీసులే వస్తారు..

తెల్లవారు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాలని భావించిన క్రమంలో ఎంపీడీవో బాలగంగాధర్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని సంజీవ్ ఆందోళన వ్యక్తం చేశారు. నీకు సంబంధం లేదని.. నువ్వేమైనా సర్పంచ్ వా... వెంటనే తన ఆఫీస్​కు రావాలని.. లేదంటే పోలీసులు మీ ఇంటికి వస్తారంటూ బెదిరించినట్లు సంజీవ్ పేర్కొన్నారు. జరిగిన విషయాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జడ్పీ సీఈవో గోవింద్ లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాడు చేసినట్లు బాధితుడు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.