CM KCR Public Meeting at Nizamabad Rural : ప్రజలు వద్దని వాదించినా తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపింది కాంగ్రెస్‌నేనని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్ పాలన మీ ముందు ఉందని.. ప్రజల ఆశీస్సులతోనే తెలంగాణలో పాలన చేస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో సీఎం కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. అది దుబారానో కాదో రైతులే తేల్చి చెప్పాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు రూ.10 వేలు నుంచి రూ.16 వేలకు పెరగాలంటే కచ్చితంగా బీఆర్‌ఎస్(BRS)కే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కరెంటు 3 గంటలు చాలని కాంగ్రెస్ చెబుతోందని.. కానీ ప్రజలు మాత్రం 24 గంటల కరెంటు కావాలని అంటున్నారని వివరించారు. కాంగ్రెస్ చెబుతున్న మూడు గంటల కరెంటు ఇస్తే అది వ్యవసాయానికి ఎలా సరిపోతుందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
BRS President Fires on Congress : రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ సభల్లో వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటార్లను వాడాలని కాంగ్రెస్(Congress Comments) అంటుంది. అసలు ఎక్కడైనా వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటార్లను ఉపయోగిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోందని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ధరణి ఉండబట్టే రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరణిని రద్దు చేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఆ ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం రావడం ఖాయమని ఆవేదన చెందారు. ధరణిలో ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిద్దామని సీఎం కేసీఆర్ తెలిపారు.
"ప్రభుత్వమే వైద్య బృందాలను గ్రామాలకు పంపించి కంటి పరీక్షలు చేయించింది. కంటి వెలుగు లాంటి పథకాలను గత ప్రభుత్వాలు ఆలోచించాయా? ఓటు వేసే సమయంలో ఎమరపాటుగా ఉంటే మళ్లీ పాత కష్టాలే వస్తాయి. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉండాలని కోరున్నా. అలాగే బీడీ కార్మికులకు పింఛను ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌నే. ఈసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే మిగిలిన కార్మికులకు కూడా ఇవ్వనున్నామని" కేటీఆర్ హామీ ఇచ్చారు.
"బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వమైనా పింఛన్ ఇచ్చిందా. నేను కూడా చిన్నప్పుడు దుబ్బాకలో బీడీ కార్మికుల ఇంట్లో ఉండి చదువుకున్నాను. బీఆర్‌ఎస్ గెలిస్తే వారందరికీ పింఛను ఇస్తాము. తెలంగాణ రాకముందు మూడు మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. ఈరోజు 103 కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాము. కిడ్నీ రోగులకు కూడా రూ.2000 పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నాము. గల్ఫ్ కుటుంబాలకు, అందరికీ బీమా చేయిస్తాం."- కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత
KCR Election Campaign in Telangana : ఈ ఎన్నికల్లో ఓటు వేసే ముందు అభ్యర్థుల గురించి ప్రజలు ఆలోచించి.. ఓటు(Telangana Election 2023) వేస్తే మళ్లీ ప్రజలే గెలుస్తారని కేసీఆర్ హితవు పలికారు. ప్రజలు గెలిస్తే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందన్నారు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుపడుతోందని చెప్పారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రైతుబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్‌నని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా కూడా రైతుబంధు లేదని వివరించారు. ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని హర్షించారు.
హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు