మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్‌రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నివాళులర్పించారు. మెట్‌పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సీఎం వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మొక్క నాటారు. కాన్వాయ్ నుంచి దిగి తెరాస శ్రేణులకు అభివాదం చేస్తూ వారి వద్దకు వెళ్లారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. సురేందర్‌రెడ్డి రైతు ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేశారు.. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నావంటూ మంత్రిని సీఎం అభినందించారు.
స్థల పరిశీలన
ఆర్మూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అదనంగా స్థలం కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడమే ఆలస్యం వెంటనే అధికారులు స్థల కేటాయింపునకు చర్యలు చేపట్టారు. సీఎం వెళ్లగానే మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్థలం గురించి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో చర్చించారు. క్యాంప్ ఆఫీస్ వెనకాల ఉన్న ఏసీపీ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని, తహసీల్దార్ కార్యాలయం పక్కన కొంత స్థలాన్ని కేటాయించే విషయమై చర్చించారు.
వేముల సురేందర్‌రెడ్డికి సీఎం నివాళులు
ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త మండలాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సమ్మతించినట్లు తెలిసింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి ఇటీవల మృతిచెందగా బుధవారం ఆయణ్ని పరామర్శించేందుకు మెట్‌పల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలూర్, డొంకేశ్వర్, ఆర్మూర్ గ్రామీణ మండలాల అంశం గురించి ప్రస్తావన రాగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నియోజకవర్గానికి ఇటీవల మంజూరైన ఎత్తిపోతల పథకాలపై ఆరా తీశారు. నవనాథ సిద్ధులగుట్టకు రావాలని కోరగా మరోసారి వస్తానన్నట్లు తెలిసింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో ధాన్యం సేకరణ, నిల్వకు గోదాములు తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు. జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయా ? అని ప్రశ్నించగా.. పంటలు వేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు నాయకులు చెప్పారు. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇరుకుగా ఉందని, వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదని సీఎంకు చెప్పగా.. 1200 గజాల స్థలాన్ని కేటాయించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులను ఆదేశించారు. సాయంత్రం 4:55 గంటలకు వచ్చిన సీఎం 5:20కి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎంపీ సురేశ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి, తెరాస నియోజకవర్గ బాధ్యుడు రాజేశ్వర్‌రెడ్డి, కోటపాటి నరసింహంనాయుడు తదితరులు పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
ఇదీ చదవండి : Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'