వామన్రావు న్యాయవాద దంపతుల హత్యపై తక్షణమే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని పౌరహక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
దారుణ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాదుల హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఆందోళనలో ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్, పీవోడబ్ల్యూ, పీడీఎస్యూ, పీవైఎల్ నేతలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.