ETV Bharat / state

నిజామాబాద్​లో ఘనంగా బాలల దినోత్సవాలు

నేటి బాలలే భావిభారత పౌరులని.. వారిని సరైన రీతిలో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వాసవిక్లబ్​ ఇంటర్నేషనల్ కార్యదర్శి పాత సుదర్శన్ తెలిపారు. నిజామాబాద్​లో బాలల దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

childrens day celebrations in nizamabad district
నిజామాబాద్​లో ఘనంగా బాలల దినోత్సవాలు
author img

By

Published : Nov 14, 2020, 7:00 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాసవిక్లబ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మారుతినగర్​లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కలెక్షన్స్​లో మానసిక విద్యార్థుల ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలలు దైవ స్వరూపులని.. వారిని సరైన దిశలో పెంచినట్లయితే, వారు భావితరాలకు మార్గదర్శకులు అవుతారని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి పాత సుదర్శన్ వెల్లడించారు.

నేటి బాలలే రేపటి బావిభారత పౌరులని పేర్కొన్నారు. వారికి సరైన విద్యాబుద్ధులు, సమాజం పట్ల అవగాహణను చిన్నతనం నుంచే తల్లిదండ్రులు నేర్పించాలని సూచించారు. దానిలో భాగంగా విద్యార్థులు వేసిన వివిధ వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఈకార్యక్రమంలో వాసవిక్లబ్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు సుదర్శన్ గుప్త, ఇంఛార్జ్ వీరేశం, కార్యదర్శి గంగాధర్, సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'బాలలు పొరపాట్లు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడవాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.