ETV Bharat / state

'అందమైన నగరంగా నిజామాబాద్​ని తీర్చిదిద్దుతున్నాం'

నిజామాబాద్​ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాద్​ తర్వాత నిజామాబాద్​ను అందంగా ముస్తాబుచేస్తామన్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ... నగరంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్​ను ఆయన ప్రారంభించారు.

centre lighting inauguration by nizamabad urban mla bigala ganesh gupta
'అందమైన నగరంగా నిజామాబాద్​ని తీర్చిదిద్దుతున్నాం'
author img

By

Published : Nov 13, 2020, 8:45 AM IST

నిజామాబాద్​లో హైదరాబాద్ తరహా ఎల్ఈడీ లైట్లని ఏర్పాటు చేశామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా చెప్పారు. రాష్ట్రంలో అందమైన నగరంగా నిజామాబాద్​ను తీర్చిదిద్దుతామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వాటర్ ఫౌంటెన్లు, సెంటర్ మీడియం లైట్లు, విశాలమైన రోడ్లని నిర్మించామని తెలిపారు. నగర సుందరీకరణలో భాగంగా సెంటర్ మీడియన్స్​కి అమర్చిన స్పైరల్ ఎల్ఈడీ లైట్లను కలెక్టరేట్ గ్రౌండ్ చౌరస్తా వద్ద స్విచ్ ఆన్ చేసి ఆయన ప్రారంభించారు. నగరవాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, రెడ్కో ఛైర్మన్ అలీం, నుడ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ జితేశ్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎంపీ అర్వింద్​పై పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే బాజిరెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.