ETV Bharat / state

Case registered against MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు.. ఏమైందంటే? - తెలంగాణ వార్తలు

Case registered against MP Dharmapuri Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదైంది. ప్రెస్​మీట్​లో సీఎం కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో... బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Case registered against MP Dharmapuri Arvind ,  MP Dharmapuri Arvind case
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు
author img

By

Published : Jan 3, 2022, 11:51 AM IST

Case registered against MP Dharmapuri Arvind : నిజామాబాద్‌ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్​ నగరంలోని బంజారాహిల్స్ పీఎస్‌లో అర్వింద్‌పై కేసు నమోదైంది. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నవంబరు 8న ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్​పై అర్వింద్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్‌ పీఎస్‌లో బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్‌ సందీప్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్వింద్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: Bandi Sanjay Arrest: బండి సంజయ్​పై నాన్​ బెయిల్​బుల్​ కేసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.