నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ తమ సేవలు ప్రారంభించింది. పలు రూట్లలో బస్సులను నడిపింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు నడుపుతున్నారు. ఎక్స్ప్రెస్లో 33 మంది, ఆర్డినరి బస్సులో 30 మంది మాత్రమే ఎక్కేందుకు అవకాశం ఇస్తున్నారు. మాస్కులు ధరించకపోతే బస్సులోకి ఎక్కనివ్వడం లేదు.
జిల్లాలో లాక్డౌన్కు ముందు పరిస్థితి కనిపించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. చిరు వ్యాపారులు తమ విక్రయాలు ప్రారంభించారు. అన్ని దుకాణాలు తెరుచుకోవడం వల్ల ప్రజల రద్దీ పెరిగింది.
ఇదీ చూడండి : 'కేసీఆర్తో జగన్ భేటీ తర్వాతే ఏపీ జీవో ఇచ్చింది'