ETV Bharat / state

MLC Kavitha Challenge to MP Aravind : ఎంపీ అర్వింద్​కు కవిత 24 గంటల డెడ్​లైన్

MLC Kavitha fires on MP Aravind : ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తున్నానని.. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత సవాల్‌ విసిరారు. నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని ఆమె డిమాండ్‌ చేశారు. తనతో పాటు నాన్న, అన్న రాజకీయాల్లో ఉండటం వల్లే ఇన్నేళ్లు సహించానన్న కవిత.. తన భర్త పేరు వాడటం సరికాదని పేర్కొన్నారు.

MLC Kavitha
MLC Kavitha
author img

By

Published : Jul 21, 2023, 3:10 PM IST

Updated : Jul 21, 2023, 9:06 PM IST

BRS MLC Kavitha Challenge to MP Aravind : రోడ్లు భవనాలశాఖల నిధుల్లో కొన్నింటిని కవితకి అప్పగిస్తున్నారంటూ... బీజేపీ ఎంపీ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలను బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను... 24 గంటల లోపు ఎంపీ అర్వింద్ నిరూపించాలని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. ఆ ఆరోపణలు నిరూపించకుంటే నిజామాబాద్​లోని పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

MLC Kavitha Latest Comments : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్బంగా ఎంపీ అర్వింద్ తనపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అర్వింద్​కు 24గంటల సమయం ఇస్తున్నానని తేల్చి చెప్పారు. అభివృద్ధి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. డీఎస్ ఉన్నప్పుడు నిజామాబాద్​లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పూర్తి చెయ్యలేకపోయారని... అలాగే నిజామాబాద్ బైపాస్ రోడ్డు కూడా పూర్తి చెయ్యలేకపోయారని పేర్కొన్నారు. కానీ బీఆర్​ఎస్ హయాంలో ఇవన్నీ ఎలాంటి అవినీతి లేకుండా పూర్తి చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

నా భర్త పేరు తియ్యాల్సిన అవసరం ఏముంది : తాను ఎంపీగా ఉన్నప్పుడు... ఒక్క జిల్లాకే రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చానని కవిత గుర్తు చేశారు. అలాగే పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడే పసుపు బోర్డు తీసుకొచ్చినా... అర్వింద్‌ తెచ్చినట్లు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు నాన్న, అన్న రాజకీయాల్లో ఉండటం వల్లే ఇన్నేళ్లు సహించానన్న ఎమ్మెల్సీ కవిత.. తన భర్త పేరు వాడటం సరికాదని పేర్కొన్నారు. అదేవిధంగా తన భర్త పేరు తియ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

'ఎంపీ అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తున్నా. నాపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలి. ఆరోపణలు నిరూపించకుంటే ముక్కు నేలకు రాయాలి. ఎంపీగా ఉన్నప్పుడు 2 కేంద్రీయ విద్యాలయాలు, స్పైస్ బోర్డు తెచ్చినా.. అర్వింద్ తెచ్చానని అంటున్నారు. నా భర్త పేరు తియ్యాల్సిన అవసరం ఏముంది? నేను, నాన్న, అన్న రాజకీయాల్లో ఉన్నామని సహించాం. నా భర్త పేరు వాడటం సరైన పద్ధతి కాదు.'-కవిత, బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ

ఆ ఉద్దేశంతోనే నిజామాబాద్​లో ఐటీ హబ్​ : అదేవిధంగా శుక్రవారం నిజామాబాద్​లో ఐటీ హబ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జాబ్ మేళా నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఐటీ హబ్.. స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒకప్పుడు ఐటీ ఉద్యోగాలు అంటే కేవలం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితం అయ్యేవని, గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించే ఉద్దేశంతో ఈ ఐటీ హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాదు.. చిన్న పరిశ్రమలు స్వంతంగా ఏర్పాటు చేయుటకు ఐటీ హబ్ ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 21, 2023, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.