ETV Bharat / state

మాత్ర ఉంటేనే మూత్రం ఆగేది... దాతలు ఆదుకుంటేనే ఆ మాత్ర దొరికేది! - బోధన్​ వార్తలు

మూత్రం ఆగాలంటే మాత్ర కావాలి. ఆ మాత్ర కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు లేకపోతే అతిమూత్రంతో ఎప్పుడేమవుతుందో తెలియని దుస్థితి. ఇదీ నిజామాబాద్ జిల్లా బోధన్​లో తల్లీతండ్రి లేని పదో తరగతి విద్యార్థి గుండేటి దీపక్ దయనీయ పరిస్థితి. లక్షలో ముగ్గురికి మాత్రమే సోకే ఈ అరుదైన జబ్బుతో ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తూ... చికిత్స చేయించుకోలేక నిస్సహాయ స్థితిలో చేయూత కోసం దీనంగా చూస్తున్నాడు.

boy need help to buy tablets for rare disease in bodhan

author img

By

Published : Aug 2, 2021, 7:49 PM IST

విధి ఎంత కఠినమైనదో... కష్టాలున్న వాళ్లనే గిల్లి మరీ బాధపెడుతుంది. లక్షల్లో ముగ్గురికి మాత్రమే వచ్చే వ్యాధి ఆ బాలునికి రావటం.. తన తండ్రి గుండె పోటుతో మరణించటం.. ఆ తర్వాత అనారోగ్యంతో తల్లి అనంతలోకాలకు వెళ్లటం.. జీవితం చరమాంఖంలో ఉన్న నానమ్మే తనకు దిక్కవటం.. ఇదీ నిజామాబాద్​ జిల్లా బోధన్​లో పదో తరగితి విద్యార్థి దయనీయ కథ.

అమ్మా, నాన్నలను కోల్పోయి...

బోధన్ పట్టణం తపాలా కార్యాలయం సమీపంలో నివసించే అబ్బవ్వకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రవి. రవి, లలిత దంపతులకు కుమారుడు దీపక్, కూతురు శ్రావ్య (గురుకులంలో 9వ తరగతి). పట్టణంలోని సామిల్​లో రవి పని చేస్తూంటే... లలిత ఇంట్లోనే బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించేవాళ్లు. ఉన్నదాంట్లో హాయిగా జీవనం సాగిస్తున్న వాళ్ల జీవితాలను విధి ఓ కుదుపు కుదిపింది. 2019లో గుండెపోటుతో రవి చనిపోగా... ఇంటి భాద్యతలు భార్య లలితపై పడ్డాయి. ఉపాధి కోసం గడప దాటింది. దుకాణాల్లో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోసింది. కొడుకుకు చికిత్స చేయించలేకపోతున్నాననే బాధ.. ఇంటి పరిస్థితి దిగజారిపోతుందనే ఆందోళనలతో ఆకలినే మరిచిపోయింది ఆ తల్లి. క్రమంగా లలిత ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రులకు తీసుకెళితే పేగులన్నీ ముసుకుపోయాయని.. బతకడం కష్టమని చెప్పారు. అలా.. లలిత కూడా 2021 మార్చి 8న కన్నుమూసింది. ఇద్దరు పిల్లలు మాత్రమే మిగలగా.. వారి బాధ్యతను నానమ్మ తీసుకుంది.

boy need help to buy tablets for rare disease in bodhan
నానమ్మతో దీపక్​

వెంటాడిన అనారోగ్యం...

ప్రస్తుతం మధుమలాంఛ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దీపక్​ను చిన్నప్పటి నుంచే అనారోగ్యం వెంటాడుతోంది. చివరకు జీవితకాలం వెంటాడే వ్యాధిగా తేలింది. ఐదేళ్ల ప్రాయంలోనే దీపక్​కు డెంగీ సోకితే హైదరాబాద్​కు తీసుకెళ్లి నయం చేయించుకొచ్చారు. అప్పుడే చాలా డబ్బులు ఖర్చు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో... ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైంది. ఏమిటా అని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎన్నో పరీక్షలు చేయించారు. పరీక్షలకు డబ్బులు లేక సతమతమవుతుంటే... స్థానిక కౌన్సిలర్ పద్మ కుటుంబం ద్వారా ఎమ్మెల్యే షకీల్​ను సంప్రదించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత ఆర్థిక సాయంతో హైదరాబాద్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకున్నారు. మూడేళ్ళ కిందట ఉపాధ్యాయురాలు సుధ కొన్ని పరీక్షలు చేయించారు.

అరుదైన వ్యాధిగా వెల్లడి...

చివరకు బాలుడికి సెంట్రల్ డయాబెటిక్ ఇన్సిపిడస్ (సీడీఐ) అనే అరుదైన వ్యాధి ఉందని గుర్తించారు. ఈ వ్యాధిలో మూత్రపిండాలను నియంత్రించే హార్మోన్​ను విడుదల చేసే పిట్యూటరీ గ్రంథి దెబ్బతినడంతో సేవించిన నీరు శరీరానికి ఇంకకుండా నేరుగా మూత్రపిండాల ద్వారా బయటకు వెళుతుంది. తరచు దాహం కావడం, తిన్నది కూడా ఒంటికి పట్టకపోవడం జరుగుతుంది. మూత్రపిండాలను పనిచేయించాలంటే కృత్రిమంగా హార్మోను మాత్రలు వాడాలని వైద్యులు సిఫారసు చేశారు. ఈ లోపాలతో బాలుడిలో ఎదుగుదల నిలిచిపోయింది. ఇంకా చిన్న పిల్లాడి రూపమే కనిపిస్తోంది.

మాత్ర వేయకుంటే తరచూ మూత్రం...

రోజుకు రెండు పుటలు మాత్రలు వేయాల్సిందే. లేదంటే తరచూ మూత్రానికి పోవాల్సి వస్తుంది. కేవలం ఒక రోజు రాత్రిలోనే ఐదు లీటర్ల మూత్రం ఉత్పత్తి అయినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ మాత్ర వేసుకోకుంటే రాత్రి పూట ఎక్కువసార్లు నిద్ర లేవాల్సిన పరిస్థితి. తరచూ దాహం, మూత్రంతో శరీరం బలహీనపడడం, రాత్రి మూత్రంతో సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతూ... దీపక్​ నరకయాతన అనుభవిస్తున్నాడు.

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఈ మాత్రాలే ఇప్పుడు గుదిబండగా మారాయి. మూడేళ్ళ పాటు దుకాణంలో పని చేసి.. వచ్చిన జీతంతో తల్లి మాత్రలు తీసుకొచ్చింది. నానమ్మ, అమ్మ సంపాదనతో సర్దుకుపోయినా... ఇప్పుడు తల్లి చనిపోవడంతో వృద్ధురాలిపైనే భారమంతా పడుతోంది. ఆమెకొచ్చే అరకొర ఆదాయం కుటుంబ పోషణకే సరిపోవడంలేదు. ఇక మాత్రలెక్కడి నుంచి తెచ్చి మనవన్ని కాపాడుకోవాలని కన్నీరుమున్నీరవుతోంది.

నెలకు రూ.2500 వరకు ఖర్చు...

"కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారు. పిల్లలను నేనే పెంచుకోవాలని అనుకున్నా. ఎవరి భాద్యతలు వారికుంటాయి. పిల్లలను ఎక్కడికి పంపాలనిపించదు. మనవడికి రాసిన గోళీలు వారానికి ఒక డబ్బా కావాలి. నెలకు నాలుగైదు అవసరమవుతాయి. ఒక్క డబ్బా రూ. 500. అలా నెలకు రూ. 2500 అవుతోంది. ఇంకో ఆడపిల్ల ఉంది. ఇద్దరికీ ఇతర అవసరాలు చూసుకోవాల్సిందే. అందుకే వ్యవసాయ పనులకు, వంటలు చేయడానికి, ఇలా ఏ పని దొరికితే ఆ పనికి పోతున్నా. నేను ఉన్నన్ని రోజులు వారిని చూసుకుంటా. ఎవరైన మనసున్న మారాజులు కనీసం మాత్రలు ఇప్పించినా... మాకు ఎంతో మేలు చేసిన వారవుతారు."- అబ్బవ్వ, దీపక్​ నానమ్మ

ముదిమి వయసులో ఉన్న అబ్బవ్వ.. చిన్నారులిద్దరినీ చూసుకునేందుకు చేతనైన కష్టం చేస్తోంది. ఎంత చేసినా.. చిన్నారుసిద్దరినీ చూసుకోడానికే చేసిన కష్టమంతా పోతే.. ఇక చికిత్స ఎలా చేపించేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరైనా దాతలు దయతలచి సాయం చేయాలని వేడుకుంటోంది.

ఇదీ చూడండి:

స్నేహితుల రోజునే విషాదం... గోదావరిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.