ETV Bharat / state

బాలుడి మృతదేహం లభ్యం... నిందితుడు అరెస్ట్​... అంతలోనే తల్లి మాయం.. - boy dead news

16 నెలల బాలుడు.. ఈ నెల 19న నిర్మల్‌ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌ సమీపంలోని చెట్ల పొదల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. శరీరంపై చిన్నచిన్న గాయాలు ఉండటంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చారు. బాసర ఎస్సై రాజు నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం నిజామాబాద్‌ ఒకటో ఠాణా సిబ్బంది ఆ మృత శిశువు తల్లిదండ్రులు జిల్లాకు చెందిన వారని చెప్పడంతో బాసర పోలీసులు జిల్లాకు చేరుకున్నారు. వారు వచ్చేలోపే బాలుడి తల్లిగా చెప్పుకొంటున్న మహిళ కనిపించకుండా పోవడంతో మిస్టరీ నెలకొంది.

boy dead body mystery in nizamabad
boy dead body mystery in nizamabad
author img

By

Published : Aug 26, 2020, 10:33 AM IST

నిజామాబాద్‌ నగరం ఒకటో ఠాణా పరిధిలోని మహిళ, తన తండ్రితో కలిసి ఓ వ్యక్తిని కొడుతున్నట్టు స్టేషన్‌కు సమాచారం రాగా... ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఏమైందని అడగ్గా.. అతడి పేరు నాగరాజు అని, ఈ నెల 11న తన 16 నెలల కుమారుడు అంజిని అపహరించుకుపోయాడని సదరు మహిళ పోలీసులకు సమాధానం ఇచ్చింది. ఇప్పుడు తారసపడటంతో కుమారుడి ఆచూకీ కోసం అడుగుతున్నట్లు వివరించింది. నాగరాజును విచారించగా.. బాలుడిని బాసరలో విడిచిపెట్టినట్లు చెప్పాడు. దీంతో నిజామాబాద్‌ పోలీసులు బాసర పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని పొదల్లో దొరికిన మృతదేహం అంజిదే అయి ఉంటుందని భావించి ఇక్కడికి వచ్చారు.

మాట మార్చారు

వారు వచ్చేలోగా బాలుడి తల్లిగా చెప్పుకొంటున్న మహిళ కనిపించకుండా పోయింది. బాలుడి మృతదేహం చిత్రాలు నాగరాజుకు చూపించగా అవి అంజివే అని గుర్తించారు. అపహరణ విషయం అడగ్గా.. నేను అలా చేయలేదని.. బాలుడి తల్లికి తనకి జరిగిన గొడవలో బాలుడు కిందపడి చనిపోయినట్లు మాట మార్చారు. పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. కనిపించకుండా పోయిన మహిళ వస్తే కానీ బాలుడి మృతిపై మిస్టరీ వీడేలా లేదు. బాలుడి తండ్రి ఓ కేసులో జైల్లో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.