ETV Bharat / state

బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం... కాల్​రికార్డింగ్​ వైరల్​..

author img

By

Published : Mar 25, 2021, 12:32 PM IST

Updated : Mar 25, 2021, 12:38 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ ఆమెర్​కు సంబంధించిన ఓ కాల్​రికార్డింగ్​ వైరల్​ అవుతోంది. బాకీ డబ్బులు ఇవ్వాలని బాధితుడు అడిగితే.. ఎమ్మెల్యే బూతుపురాణం చదవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.30 లక్షలు ఎమ్మెల్యే ఇవ్వాలంటూ... బాధితుడు ఆరోపిస్తున్నాడు.

bodhan mla shakeel aamer call recording viral

తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా... నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ బెదిరిస్తున్నట్టు ఓ కిరాణా వ్యాపారి ఆరోపించాడు. బాన్సువాడ పట్టణానికి చెందిన అభిషేక్ కిరణా యజమాని రుద్రంగి మురళీధర్​కు 2018 రంజాన్ పండగ సందర్భంగా 6 వేల తోఫా ప్యాకెట్లు ఆర్డర్ ఇచ్చాడు. ఈ మేరకు సదరు షాపు యజమాని ఒక్కో ప్యాకెట్ రూ. 600 లకు బేరం కుదుర్చుకుని మొత్తం 6000 ప్యాకెట్లు ఆర్డరిచ్చాడు. 36 లక్షల రూపాయల్లో 12 లక్షలను ఎమ్మెల్యే చెల్లించాడు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు భోజన సదుపాయం క్యాటరింగ్ ద్వారా ఏర్పాటు చేయించగా... సుమారు రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే షకీల్​... సుమారు రూ. 30 లక్షలు తనకు బాకీ పడ్డినట్టు మురళీధర్​ పేర్కొన్నాడు.

బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం... కాల్​రికార్డింగ్​ వైరల్​..

డబ్బుల విషయమై రెండేళ్లుగా బోధన్​లోని నివాసానికి 40 నుంచి 50 సార్లు, హైదరాబాద్​కు 20 సార్లు వెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయాడు. తన ఫోన్ నెంబర్​ను కూడా బ్లాక్ లిస్టులో పెట్టినట్టు తెలిపాడు. దిక్కుతోచని మురళీధర్​... ఈ విషయమై ఎమ్మెల్యే సన్నిహితుడికి సోమవారం ఫోన్ చేసి బాధ వెళ్లగక్కగా... సదరు వ్యక్తి ఎమ్మెల్యేతో ఫోన్ మాట్లాడించాడు. ఫోన్లోనే ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ బూతుపురాణం అందుకున్నారు. అసలు డబ్బులు ఇచ్చేదే లేదని బెదిరించిన కాల్​ రికార్డింగ్​ ఇప్పుడు వైరల్​గా మారింది. తన కుటుంబానికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టిన ఎమ్మెల్యే బాధ్యత వహించాలని బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు.

ఇదీ చూడండి: విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Last Updated : Mar 25, 2021, 12:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.