క్లిష్ట పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని ఇందూరు బ్లడ్ డోనార్స్ గ్రూప్ ప్రధాన అడ్మిన్ నరాల సుధాకర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోవడం వల్ల రెడ్‌క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేవలం సోషల్ మీడియాలో చూసి ఈ రోజు పది మంది రక్తదానం చేయడం గొప్ప విషయమని సుధాకర్ అన్నారు.
ఇంకా చాలా మంది ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రక్తదానం చేసి సాటి మనిషి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐడియా సాగర్, రామకృష్ణ, ప్రణీత్, గంగాధర్, పోతన్న, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఎన్నికల్లో అక్రమాలు జరిగాయ్... సీబీఐతో దర్యాప్తు చేయించండి'