ETV Bharat / state

సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం: ఎంపీ అర్వింద్​ - నిజామాబాద్​ జిల్లా వార్తలు

భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని ఎంపీ అర్వింద్​ అన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారమవని సమస్యలను తీర్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

bjp mp arvind speak on one year  ruling in nizamabad
సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం: ఎంపీ అర్వింద్​
author img

By

Published : Jun 9, 2020, 3:17 PM IST

ఏడాది కాలంలోనే అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని నిజామాబాద్​ భాజపా ఎంపీ అర్వింద్​ అన్నారు. వివిధ పథకాలను ప్రవేశపెట్టి, ఎన్నో ఏళ్లుగా పరిష్కారమవని సమస్యలను తీర్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్​ భారత్​ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని నివారించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ యావత్ ప్రపంచంలోనే ముందున్నారని పేర్కొన్నారు. శాసనమండలి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా వేసుకొని నిజామాబాద్ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను భాజపా నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇవీ చూడండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.