కొవిడ్-19 వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణలో టెస్టుల సంఖ్యను మరింత పెంచి, వైద్య సేవలను విస్తరించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదని వారు ప్రశ్నించారు. బోధన్ జిల్లా ఆసుపత్రిలో ధర్నా చేస్తున్న భాజపా నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.