ETV Bharat / state

ఎన్నికల కోడ్​కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: భాజపా నాయకులు - తెరాస నాయకులు ఎన్నికల కోడ్​ అతిక్రమిస్తున్నారని ఫిర్యాదు నిజామాబాద్​

తెరాస నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని భాజపా నాయకులు నిజామాబాద్​ కలెక్టర్​, ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా.. సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేశారని ఆరోపించారు. తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత అభ్యర్థిత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కోడ్​కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: భాజపా నాయకులు

author img

By

Published : Sep 30, 2020, 8:34 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​కు విరుద్ధంగా తెరాస నాయకులు వ్యవహరిస్తున్నారంటూ భాజపా నాయకులు బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా.. సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేల సమక్షంలో భాజపా కార్పొరేటర్, ఎంపీటీసీలకు తెరాస కండువా కప్పడం ఎన్నికల కోడ్​కు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత అభ్యర్థిత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ న్యాలం రాజు, భాజపా నగర అధ్యక్షుడు పంచరెడ్డి లింగం, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల కోడ్​ పాటించని తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.