పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో భాజపా సన్నాహాలు మొదలు పెట్టింది. క్లస్టర్ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. 5 లోక్ సభ స్థానాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నియోజకవర్గాల కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. మొదటి విడత భేటికి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రామ్ మాధవ్ సూచించారు. ఈ నెల 13న భాజపా జాతీయ అధ్యక్షడు అమిత్ షా కూజా జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు.