నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణకు ద్విచక్ర వాహనాల ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించారు. చౌరస్తా నుంచి పలు కాలనీల్లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ చేపట్టారు.
కన్నులపండువగా సాగిన ర్యాలీలో సుమారు 1000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. జై శ్రీ రామ్ అంటూ భక్తులు చేసిన నినాదాలతో వీధుల్లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గుండె సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తలసాని