నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్ బండార్ కాకతీయ మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం అందరూ కలిసి ఒక్కచోట చేరి బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మని నిమజ్జనం చేశారు.
ఇవీ చూడండి: వరదలకు ఉత్తర భారతం విలవిల- 137మంది మృతి