నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామంలోని లింబారెడ్డి మామిడి క్షేత్రంలో మామిడి చెట్ల ప్రూనింగ్, పునరుద్ధరణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి చెట్ల కొమ్మల కత్తిరింపులు, మామిడి తోటల్లో యాంత్రీకరణ గురించి రైతులకు అవగాహన కల్పించారు.
వ్యవసాయ శాస్త్రవేత్త మహేందర్ రైతులకు పూత, పిందె, కాయ దశల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. రైతుల ఆందోళన..