ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలంటూ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
ఆశా వర్కర్లకు ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ అందజేయాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత, సెలవులు, బీమా లాంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మెటర్నిటీ సెలవులు, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు వర్తింపజేయడం లేదని వాపోయారు. కరోనా ప్రత్యేక అలవెన్స్ బకాయిలు, జనవరి 2020 నుంచి జూన్ వరకు రూ.1000 విడుదల చేయాలని కోరారు. కొవిడ్‌తో మృతి చెందిన ఆశా వర్కర్లకు బీమా చెల్లించాలన్నారు. ప్రతి వేయి మంది జనాభాకు ఒక ఆశాను నియమించి.. రూ.10 వేల వేతనం నెలలో ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు.