గీతం యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ కోసం... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రవేశ పరీక్ష రాశారు. కరోనా నేపధ్యంలో యూనివర్సిటీ నిర్వాహకులు.. విద్యార్థులు ఇంట్లో ఉండి పరీక్ష రాసేలా ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యే తన ఇంటోనుంచే ఆన్‌లైన్‌లో ఎగ్జాం రాశారు. గత సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎంలో పట్టభద్రులు అయ్యారు. ఈ సంవత్సరం గీతం యూనివర్సిటీలో పార్ట్ టైం పీహెచ్‌డీలో చేరాలని ఎగ్జాం రాశారు.
ఇదీ చూడండి: 'ఎలిమెంట్స్.. యావత్ భారతం గర్వపడేలా చేస్తుంది'