ETV Bharat / state

పట్టాలెక్కని ఆర్మూర్​-ఆదిలాబాద్​ రైల్వే పనులు - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా కోరుకుంటున్న ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వే పనులు పట్టాలెక్కడం లేదు. ఈ ప్రాంతాల వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన రైలు మార్గం అడుగు ముందుకు కదలడం లేదు. కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైంది.

పట్టాలెక్కని ఆర్మూర్​-ఆదిలాబాద్​ రైల్వే పనులు

author img

By

Published : Aug 7, 2020, 9:37 AM IST

పట్టాలెక్కని ఆర్మూర్​-ఆదిలాబాద్​ రైల్వే పనులు

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్​కు రైల్వే లైన్ ఏర్పాటైతే జిల్లావాసులు వాణిజ్య, విద్య, వ్యవసాయ పనుల కోసం ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాగ్పూర్, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి సౌలభ్యంగా ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ. 2800 కోట్లతో చేపడతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయితే పనులు చేయడం లేదని రాష్ట్ర ప్రజాప్రతినిధులు, రాష్ట్రం ముందుకు రావడం లేదని రైల్వే అధికారులు చెప్పుకుంటూ ఉండటం వల్ల పనులు ప్రారంభం కావడం లేదు. రైలు మార్గం మంజూరు తర్వాత కేవలం సర్వే మాత్రమే చేసి రైల్వే అధికారులు సరిపెట్టారు.

సర్కారే ముందుకు రావడం లేదు..

గతంలో ఆదిలాబాద్-పటాన్​ చెరు రైలు మార్గం ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. సుమారు రూ. 3 వేల 700 కోట్ల వ్యయంతో 317 కిలోమీటర్ల మార్గం ఏర్పాటు చేయాలని భావించినా... నిధుల కేటాయింపులో జాప్యంతో ఆ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. ఈలోపు నిజామాబాద్పెద్దపల్లి లైన్పూర్తయి రైళ్లు నడుస్తుండగా... మళ్లీ ఆదిలాబాద్ ఆర్మూర్​ రైల్వే లైన్​ డిమాండ్​ ముదుకొచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే రైలు మార్గాలకు ఖర్చుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాల్సి ఉంటుంది. ఆర్మూర్-ఆదిలాబాద్ రైలు మార్గం వ్యయంలో సగం వరకు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెండేళ్ల కిందటే మంత్రులు రైల్వే మంత్రికి వివరించారు. అయినా పనులు మాత్రం మొదలవ్వలేదు. రాష్ట్ర సర్కారే ముందుకు రావడంలేదని.. మరోసారి ప్రభుత్వంతో చర్చిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానంద్ మాల్యా పేర్కొన్నారు.

వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి..

ఆర్మూర్-ఆదిలాబాద్ రైలు మార్గం పూర్తయితే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మహారాష్ట్రతో ఆదిలాబాద్​కు ఉన్న వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. ఆర్మూర్​లో పండించే విత్తనాలకు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. రైలు మార్గం ఏర్పాటైతే విద్య, వాణిజ్య, జీవనోపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

ఇదీ చూడండి : రైలింజన్ ఢీకొని.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.