ETV Bharat / state

పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్ శరత్

నిజామాబాద్ పార్లమెంట్​ ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తోంది. తీవ్ర నిరసనతో రైతులు పెద్ద సంఖ్యలో బరిలో ఉన్నారు. నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఎం-3 ఈవీఎం, వీవీప్యాట్లపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

తెల్లవారు జామునే మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలి : కలెక్టర్
author img

By

Published : Apr 8, 2019, 11:12 AM IST

నిజామాబాద్ లోక్​సభ పరిధిలో పోలింగ్‌ కోసం జగిత్యాల, కోరుట్ల, నియోజకవర్గాలకు సంబంధించి శిక్షణ సదస్సు నిర్వహించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈవీఎంల పరిశీలన పూర్తి చేశారు. సిబ్బందికి శిక్షణ అందించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ హాజరయ్యారు.
పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
ఎన్నికల సిబ్బంది సకాలంలో పోలింగ్‌ స్టేషన్‌కు చేరుకుని ఉదయం 4.40 గంటలకే మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని సూచించారు. సాంకేతిక సహాయం కోసం ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌కు ఒక ఇంజనీరును కేటాయించారు. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ గౌతమ్‌, జగిత్యాల ఆర్డీవో నరేందర్‌, పోలీస్​ అధికారులు పాల్గొన్నారు.

పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్ శరత్

ఇవీ చూడండి : నేడు రైతుల పిటిషన్​పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.