నిజామాబాద్ జిల్లాలోని నారాయణ ఈ-టెక్నో విద్యాసంస్థను సీజ్ చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కంటేశ్వర్లో నారాయణ విద్యాసంస్థ వచ్చిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి తెలిపారు.
తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్మిషన్ నిర్వహిస్తున్న ఆ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీఈవోకు వినతిపత్రం అందజేశారు. విద్యాసంస్థను వెంటనే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాలన్నారు. లేనిపక్షంలో రానున్న కాలంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.