వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 5న చేపట్టే రోడ్డు బంద్‌ని విజయవంతం చేయాలని ఏఐకేఎస్‌సీసీ కోరింది. 2014 ఎన్నికలకు ముందు రైతుల ఆదాయం రెండింతల చేస్తామని చెప్పిన మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారని ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి వీ ప్రభాకర్ నిజామాబాద్‌లో అన్నారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు కంపెనీలకు దాసోహం చేస్తున్నారని ఆరోపించారు. తమ సొంత భూముల్లోనే రైతులను జీతగాళ్లు గా మార్చే విధంగా చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: గ్రీటింగు కార్డులమ్మి చదువుకున్నాడు... లూడో కింగ్ అయ్యాడు..!