మిడతల దండు నుంచి రైతాంగాన్ని కాపాడాలంటూ అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐకేఎమ్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు, అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోకి రాబోయే మిడతల దండు నుంచి రైతులను కాపాడాలని, అలాగే అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏఐకేఎమ్ఎస్ నాయకులు ఆకుల పాపయ్య కోరారు.
మిడతల దండు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు. మిడతల దండు నుంచి పంటను కాపాడడానికి వేపనూనె పిచికారీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారని, దీనికి అనుగుణంగా రైతులకు 70 శాతం రాయితీ ఆ నూనె అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాజేశ్వర్, సాయి రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనాను వ్యాపారంగా చూడొద్దు.. అనవసరంగా పరీక్షలు చేయొద్దు'