నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు-కూలీ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌కు బకాయి పడిన రూ.300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మార్చి నుంచి సరఫరా చేసిన ధాన్యం బకాయిలను సీడ్ కార్పొరేషన్ రైతులకు వెంటనే చెల్లించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం సీడ్స్ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కంపెనీలకు మేలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు ఆచరణకు నోచుకోవడం లేదని ఏఐకేఎంఎస్ నాయకులు వాపోయారు. బకాయిలు చెల్లించి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌ను బతికించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి: మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు