సీఎం కేసీఆర్‌కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసకృష్ణన్, మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతన్నలు పడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో తెగుళ్లతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.
ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చు చేసే తెరాస, అన్నం పెట్టే రైతులను ఆదుకోకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ మాత్రమే రైతుల పక్షాన నిలబడే ఏకైక పార్టీ అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మధుయాష్కీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టామని ఆయన వెల్లడించారు.