నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన అన్నదాన కార్యక్రమం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 8న ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకుల కోసం అన్నదానం ప్రారంభించారు. అప్పటి నుంచి మూడేళ్లుగా నిరాటంకంగా ఈకార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి రోజు దాదాపు 700 మందికి భోజనం పెడుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల బంధువులు, సహాయకులు భోజనం కోసం పడుతున్న ఇబ్బందులు గమనించి కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో జెడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్‌లు కేక్‌కట్ చేశారు. అనంతరం రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. కవిత చేస్తున్న అన్నదాన కార్యక్రమం.. అభాగ్యుల ఆకలి తీరుస్తోందని విఠల్ రావు అన్నారు.
ఇదీ చూడండి: బీంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్